Wednesday, January 28, 2009

ఎవరు ఏ టపాలకి కామెంట్స్ రాసారో చూడటం ఎలా?

నాకు అప్పుడప్పుడూ ఎవరు ఏ,ఏ బ్లాగ్ ల లో, ఏఏ టపాలకి కామెంట్స్ రాసేరో చూద్దామని అనిపిస్తుంది. ఉదాహరణకి కొత్త పాళీ గారు ఏ బ్లాగులలో, ఏ టపాలకి వ్యాఖ్యలు రాసారో చూద్దామంటే నాకు వెసులుబాటు ఇక్కడ కనపడింది: [ఇంకో విధానం మీకు తెలిస్తే తెలుప గలరు]
కొత్త పాళీ గారి వ్యాఖ్యలు


మీరు ఎక్కడ వ్యాఖ్యలు రాసేరో తెలియాలంటే ఈ లంకె వాడుకోవచు:
<a href="'http://www.Bhalira.com//bhalira/LinqServlet?Action=" target="'bhalira'"><img src="&#39;http://www.bhalira.com/bhalira/jsp/my_comments.PNG&#39;/" /></a>

మీకు బ్లాగర్ పేరు తెలిస్తే http://www.bhalira.com/ పేజీ మీద "Advanced Search" నొక్కి, బ్లాగర్ పేరుని keywords ఫీల్డ్ లో టైపు చేసి, "అన్ని టైపులు" బదులు "బ్లాగర్" టైపు సెలెక్ట్ చేసి సెర్చ్ చెయ్యండి. బ్లాగర్ రిజల్ట్స్ నించి , మీకు కావసిన బ్లాగర్ "రాసిన వ్యాఖ్యలు" లంకె నొక్కండి.మీరు మీ వెబ్ సైట్ మీద లంకె వేద్దాము అంటె, బ్లాగర్ రిజల్ట్స్ నించి, మీకు కావాల్సిన బ్లాగర్ "వ్యాఖ్యల లంకె మీ వెబ్ సైట్ కి" నొక్కండి. మీరు బ్లాగ్ స్పాట్ మీద ఉంటే, భళిరా గాడ్జెట్ మీ బ్లాగ్ మీద పెట్టుకో వచ్చు. ఇది ఎప్పటికప్పుడూ, కొత్త గా పబ్లిష్ అయ్యిన టపాలని మీ బ్లాగ్ మీద నే చూపెడుతుంది. ఈ గద్గేట్ నించే, మీరు సెర్చ్ చేసి కామెంట్స్ , టపాలు చూడ వచ్చు.పెట్టుకొనే విధానం ఇక్కడ వివరించ బడింది. http://bhalira.blogspot.com/2008/11/blog-post.html

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

ఉత్పలమాల:-
యాజి మహాశయా! మిగుల యచ్చెరు వొందితి మీదు బ్లాగులో.
భాజనులైన సద్ వినుత పాఠక వర్గము సద్ విమర్శలన్
రాజిలు వానినెంచుచు సరాసరి చూడగ నౌను మీరల
వ్యాజ కృపామృతమ్ము మము వర్ధిల జేయగ జిల్కిరిచ్చటన్.