Tuesday, November 18, 2008

జేమ్స్ బాండు కి కాసింత ఓదార్పు

బాండ్ సినిమా అంటే (నాకు) ఒక విధ మైన expectation ఉంది. బాండ్ సినిమా ల లో ఉండేది యాక్షన్, అందమైన అమ్మాయిలు, కొద్దిగా శృంగారం, కొత్త వి వింతైన గాడ్జెట్ ల ప్రదర్శన. ఇదమిద్దంగా రొటీన్ ఫార్ములా. ఎప్పుడూ ఇక తరువాతి బాండు సినిమా చూడ కూడదూ అనుకుంటూనే చూడటం ఆనవాయితీ అయిపోయింది. చూడ కూడదు అని అనుకోవటం ఎందుకూ అంటే కథ లో పెద్ద వైవిధ్యం ఉండదు కాబట్టి. ఈ బాండు సినిమా లో కూడా వైవిధ్యం పెద్ద గా లేదు కాని బాండు వ్యక్తిత్వం ప్రదర్సన లో కొద్దిగా తేడా కనబడింది. ముఖ్య మైనది ఏమిటీ అంటే, Bond gets personnel. తను ప్రేమించిన అమ్మాయి చనిపోయిన నేపధ్యం లో, బాండు ప్రతీకారం తీర్చు కొనే ప్రయత్నం. తర్వాతది, మొదటి సారి బాండు , హీరోయిన్ తో శృంగారం చెయ్యక పోవటం. ఇంకా "shaken but not stirred" dialogue ని బార్తెన్దర్ చేత చెప్పించటం. (బాండు మూవీ ల లో బాండు చెప్పే ట్రేడ్ మార్క్ డైలాగు ). ఓవర్ ఆల్ గా బాండు ని సెంటిమెంటల్ గా ఓవర్ హాల్ చెయ్యటం. నాకైతే బాగానే నచ్చింది ఈ ట్విస్ట్. బ్రాస్నన్ బాండు సినిమా ల లోని ద్వంద అర్ధ సంభాషణలు (double entendres) క్రైగ్ సినిమా లో కన పడవు. ఇది కూడా మంచి మార్పు. క్రైగ్ కి సూట్ అవవు ఏమో కూడా. బాండు సినిమా ల లో ఉండే సట్ల్ కామెడి ఎలిమెంట్ లేదు. గాడ్జెట్ లు కూడా లేవు. అసలు Q నే లేడు. నేను ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. బాండు ని సెంటిమెంటల్ చూపెట్టటం నా వరకు బాగానే ఉంది. క్రైగ్ మాత్రం మంచి బాండ్ ల లో ఒకడు. బాండు సినిమా కి కూడా ఇంట వివరణ అవసరమంటారా? అలాగే కానివ్వండి.. ఏదో ఉబుసు పోక సినిమా చూడటం, ఆ పైన ఈ టపా..

Wednesday, November 12, 2008

కాలం చెల్లిన బర్బరీకుడు

నాకు భారతం లోబాగా నచ్చే వోళ్ళు ఇద్దరైస్. బర్బరీకుడు , దుశాసనుడు.
దుశాసనుడు ఎర్రి బాగు తనం ఏ మాత్రం లేకుండా సేయ్యాల్సిన ఎదవ పనులు సేసి సచినోడు. ఇహ బర్బరీకుడో? ఉత్త ఎర్రి బాగులతనం కారణం గా సచ్చాడు. కొద్దిగా లోతుగా సూస్తే...
బర్బరీకుడు మహా బలశాలి, పవన్ కళ్యాన్ మాదిరి మాట. రవి నే ఇదమిద్దం గా సొంతం సేసుకున్న కురు సామ్రాజ్యాన్ని (అంటే రవి అస్తమించని బ్రిటిష్ లాగ ఐయ్స్) ఒక బాణం లో మట్టాష్ చేయ గల వీరుడు.
అతని కాడ మూడు బాణాలు ఉండేవి. కిట్టుడు యాజ్ యూజుఅల్ ఆడి కాడికి మారు ఏషకం లో పొయ్యి, ఏందిరా మూడు బాణాలు ఎవడికీ అని అడిగీసీడు.
ఆడు ఎర్రి బ్లాగులాడు (అంటే నా లాగ) .
ఒకటి కురు సైన్యానికి అన్నాడు.
ఇంకోటి అని అడిగితే కిట్టుడు కైస్ అనీసాడు.
మూడేది అంటే, మూడో దేటిస్ మూడోది, నెక్కలు రావేటి అని గసిరీసాడు.
ఆ దెబ్బకి కిట్టుడికి గుండె సెరువు అయ్యిపోనాది. నెక్కలు రానందుకు గాడు. కిట్టుడిని సంపీస్తాడని.
ఇంకెందుకు ముసుగులో ఫైటింగ్ అనీసి, నేనే ఆ కిట్టుడిని, నీ తల కాయి ఇచ్చేయ్స్ గలాటకి బలి కావలి అని అడిగీసాడు.
మరి లారెన్సే అందరినీ ఉతికి ఆరేస్తే నాగ్గాడు ఎందుకైస్.
bఅర్బరీకుడు ఎర్రి బ్లాగులోడు కదా! ఆడు ఇచ్చీనాడు .
ఇంతకీ నాను సెప్పేది ఏంటీ అంటే, అలాటి ఎర్రి బ్లాగులోలు మనలోనూ ఉన్నరేహే. అలాటి ఎర్రి బ్లాగుల తనం మన నించి పోవలైస్.

Sunday, November 9, 2008

క్లెవర్ , కాన్త్రోవర్శియల్ టపాలు నేనూ రాస్తా!

ఏంటో ఈ మధ్య నే బ్లాగర్ అయిన నేను, చాల క్లేవేర్ గా చాల మంది మెదడుకి బాగా పదును పెట్టేటు వంటి రాసిన టపాలని చదివేసా. చదివేహేసాక నాకు ఏవైనా రాసేహేయ్యాలి అనిపించింది. ప్రస్తుతానికి క్లేవేర్ గా వ్యాఖ్యలు రాసే క్లేవేర్నేస్స్ గురుంచి రుష్యసృన్గుడి లా కొద్దిగా తపస్సు చేసి ఈ కింద ప్రశ్నలని, పనికి మాలిన వారికి ఉత్తుత్తునే వరాలిచ్చే (అంటే నాలాటి వారకా? హతోస్మి) బ్రహ్మ ని గాని, పోనీ జీసుస్ నైనా పర్లేదు (సేక్యులరిసం కోసం మాట) కోరుకుంటా:[నన్నుమన్నించాలి నా GK పూరు , నాకు రెండే మతాలు తెలుసు]
బ్రహ్మానందం బెస్ట్ కమెడియన్ నా , లేక బాలకృష్ణా ?
రాముడు ఆర్యన్ అయితే రావణుడు సంతతి మనమా?
చిరంజీవి కి సూపెర్ మాన్ కి యుద్దం అయితే ఎవరు గెలుస్తారు?
ఇంజనీరింగ్ నాలుగు ఏళ్ళు చదివి సాఫ్ట్ వేర్ జాబు చెయ్యటం నైతికతా ?
సల్మాన్ ఖాన్ బాగా కాలుస్తాడ , అభినవ్ బింద్రా నా ?
మీరు ఆఫీసు లో 8 గంటలూ సిన్సియర్ గా పని చేస్తారా ? చెయ్యక పోవటం నైతికతా ?
ఆకలి అహింస కట్టుబాటు దాటితే తప్పవుతుందా ?
ఓల్డ్ ఏజ్ హోమ్స్!
ఎవరైన్నా ఈ టీవీ సీరియల్స్ దర్శకులని, రచయితల కి హాని కలిగిస్తే అది సెల్ఫ్ డిఫెన్స్ కింద వస్తుందా?

మీరే నా పాలిట బ్రహ్మ అయితే మీ బ్లాగ్ మీద వరం ఇవ్వండీ. మీరు మరొక రుష్య సృన్గుడు అయితే ఒక వ్యాఖ్య రాయండి (జోగి , జోగి వ్యాఖ్యలు రాసుకుంటే జోగు వచ్చిందని, నిద్ర కూడా నాకు సమ్మతమే) .

Saturday, November 8, 2008

ఏ[౦] (దిక్కు) తోచక

తూర్పున ఎదురు చూసే నీ నయనం
పశ్చిమాన పరితపించు నీ హృదయం
ఉత్తరమే ఇరువురకూ అనుసంధానం
దక్షిణ గా కావాలి నీ దరహాసం

Saturday, October 25, 2008

నవ్వి పోదురు గాక నాకేమి..

చీకటిని కరిగిస్తూ కరుగుతూన్న కొవ్వొత్తి
మరెదో లోకం లో ఉన్నా అన్న భ్రాంతి

చల్లగా వీచేను శీతలపు గాలి
నాకేమి భయం చెంత ఉండ చెలి

మబ్బులను చీలుస్తూ మెరిసింది ఓ మెరుపు
ప్రియురాలి కళ్ళ లో కనపడే కాంక్ష ఎరుపు

ఆగి ఆగి గర్జించే ఆకాశం ఓ ఉరుము
వెచ్చగా తగిలేటి ప్రియురాలి నడుము

మెల్లగా వినపడేటి జగజ్జీత్ సింగు
అనిపించే ఈ సమయం ప్రపంచానికి నేనే కింగు

విరహ వేదన

చీకట్లో, నా మనసు వాకిట్లో నీ శిరోజాలు చిక్కుబడి
గది లో, నా ఈ మదిలో విన పడే నీ అడుగుల సవ్వడి

నిశీధి లో, ఈ నీరవం లో కరిగిన మంచు లా నీ రూపం
నా ఈ వ్యధలో, నీ ఈ దూరం, ఏ సోమయాజి శాపం

ఏకాంతం లో, నా హృదయంలో, ఎవరు విరహపు మంటలు రేపారు
నిశ్శబ్దం లో, నీ మౌనం లో ఎవరు నిరాశ నీడై వచ్చారు

నీ విరహం లో, నా గుండెలలో ఎవరు సంధిచారు శరం
మన కలయిక లో నీ కౌగిలి లో ఎప్పుడో కరిగే వరం

అనగనగనగా ఒక శర్మ

Disclaimer: ఈ కథ లో పాత్రలు అన్నీ హిండాలియం తో చేయ బడినవి. కిలం పడితే అటూ ఇటూ చూసుకొని కిల(౦), కిల(౦) అంటూ సర్దుకు పోతారని ఆశిస్తూ

అనగనగనగా ఒక సోమ భూపాల శర్మ. ఇప్పుడంటే మన సినిమా రచయితలూ, డైరెక్తర్స్ కథల కోసం లుంగీ పైకెత్తుకొని దిండు, చాప, పెన్ను, కాగితం పుచ్చుకొని ఫారిన్ ఫిల్మ్ ఉత్సవాలకో వెళ్లి పోవటం మొదలెట్టారు కాని, శర్మ హయాం లో ఇంకా పెళ్ళయిన భగవాన్ బాబు తన ప్రియురాలు తో చిలిపిగా నీకేమి తెచ్చేనో చెప్పుకో అంటూ అడిగితే గారం గా ప్రియురాలు అబ్బ నేను చెప్పా లేను బాబు, మీరే చెప్పండి అంటే "ఇదిగో నీ కోసం చుక్కల చీర" అన గానే చుక్కల చీర లూ, పిడికెలు, గాడిద గుడ్లూ బ్యాక్ డ్రాప్ గా పాట సినిమా తీసే రోజులు.
అలాగే సర్పేశ్వర రావు కి సిగ్గు పడుతూ వాళ్ల ఆవిడ నాకు మామిడి కాయ తినాలని ఉంది అంటే వెర్రిబాగుల వాడి లా ఎందుకూ? అని అడిగితే సిగ్గు పడుతూ గోడ మీద వేలాడుతూన్న ఒక బుజ్జి గాడిద పిల్ల ఫోటో చూపెడితే, సర్పేశ్వర రావు 'అమ్మ దొంగా' అని పెళ్ళాం ని వాటేసుకుని అచ్చం నీ వెధవ పేస్ వస్తూంది అంటే కాదు నీ దరిద్రం పేస్ వస్తుంది అని పాడుగునే టైమ్స్ మాట.
ఇలాంటి టైమ్స్ లో శర్మ ఇంగ్లీష్ వాళ్లు తీసిన జీసస్, రజనీష్ లాటి సినిమా లు చూసి బాగా ఉత్తేజం పొంది తెలుగు లో ఒక సినిమా తీశాడు. బాగా హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా అదే కథ ని కొద్ది గా పేరు మార్చి "పుండు", "పుండు మీద కారం చల్లితే" అని చెప్పి చాల పేర్ల తో చాల బాగా తీసాడు. ఇదే ఊపులో బావుందా , బావుందా అని ఇంకో సినిమా ని Is it good, Is it good అనే ఇంగ్లీష్ సినిమా ప్రేరణ తో తీశాడు.
మన సెన్సార్ వాళ్లు ఆ సినిమా లో బూతు మాటలని , బూతు సన్ని వేసాలని, ఇంకా ఈ టీవీ వాళ్లు ఫ్రీ గా వార్త ల లో చూపెట్టే లాటి రక్త పాత సన్నివేసాలని యధా తధం గా ఉంచేసి , సెన్సార్ మెంబెర్స్ లో ఒకడి మనవరాలు అప్పుడే మూడో తరగతి లో కోత గా అంకెలు నేర్చు కొన్న దృష్ట్యా ఒహ రెండు అంకెలు ఆ అమ్మాయి ని చెప్పా మంటే ఆ అమ్మాయి C, 7 చెప్పహా , శర్మ సినిమా లోంచి రెండు , ఏడు రీల్స్ ని తీసేసి రిలీజ్ చేసేశారు.
శర్మ కి చాల కోపం వచ్చింది. చేతి లో కర్పూరం వెలిగెంచేసుకొని ఎవరైనా వచ్చి ఆర్పుతారని కాసేపు చూసి ఎవరూ రాక తనే ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదేసుకొని ఇంక నేను హిందీ లో తప్ప తెలుగు లో సినిమా తీయను అని ఆంధ్ర దేశం వది లేసి వెళ్లి పోయాడు.
ఇది విని సముద్రానికి వాడెవడో గుర్తు కొచ్చేసి చాల సేపు పగల బడి నవ్వేసింది. నిండు సభ లో లక్ష్మణ దేవర నవ్వితే రాముడు explanation అడిగినట్టు గా, సముద్రం అలా నవ్విందని కోపం వచ్చి ఏ explanation అడగ కుండా అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ ట్రీ చైనా మీద యుద్ధం ప్రకటించాడు. ఒక అర నిమిషం పోయాక చైనా ప్రెసిడెంట్ యింగ్ యాంగ్ కి కాల్ చేసి ఫోన్ లోనే కాళ్ళ మీద పడి పోయి , తూచ్ నేను బంగ్లాస్తాన్ అన బోయి రెండు పేర్లు ఒక లాగే ఉంటే కన్ఫూస్ అయిపోయాను అని తెగ ఇది అయిపోయాడు. సర్లెండి ఆ గొడవ ఇప్పుడు ఎందుకు కాని..
సశేషం

Tuesday, October 21, 2008

నా తరమా "ఈ" టీవీ చూడ

నా మూడో తరగతి లో అనుకుంటా. నేను స్కూల్ కి పోనని మొరాయిస్తే మా అమ్మ నన్ను "స్కూల్ మానేస్తే మానేసావు వెధవ స్కూల్ , చదివి ఎవడిని ఉద్ధరించాలి, టీవీ చూద్దాం రా నాన్న" అని ఎంతో ఆప్యాయమ్గా పిలిచింది. నేను నిజమే కామోసు అని చంకలు గుద్దు కుంటూ నా పుస్తకాల మూటని వీధి చివరలో ఉన్న పల్లీల బడ్డీ వాడికి ఇచ్చేసి వస్తా అన్నా. ఇద్దూ లేమ్మా ముందు ఈ ప్రోగ్రాం చూసి పో నాయన అంది. సరే కదా అని మా అమ్మ పళ్ళెం లో పెట్టిన జన్తికీలు నములుతూ టీవీ ముందు చతికిల పడ్డాను.దానిని ఈ టీవీ అంటారని ఆ చానెల్ ని ఇన్నాళ్ళూ మా కంట పడకుండా అమ్మ దాస్తూ వచ్చిందని తెలిసి కొద్ది గా హాచర్యం, ఆ తర్వాత మరెంతో కోపం వచ్చేసాయి. నా కోపం గుప్పెడు జన్తికీలు తో పాటు నాలో నేనే కుక్కుకొని (ఏంత లేదన్నా ఇక స్కూల్ కి పోవక్కర్లేదన్న అన్నది అమ్మే కదా అని అమ్మ కి క్షమా భిక్ష పెట్టేసా) ఈ టీవీ చూడటం మొదలెట్టా. ఆ సీరియల్ పేరు "నీ పిండాకూడు తిన తరమా" అని. రెండు నిమిషాలు అవగానే కొద్దిగా అసహనం మొదలైంది. కార్టూన్ చాన్నేల్ గాని, చిన్న బట్టలు వేసుకునే పెద్ద అమ్మాయిలను చూపెట్టే చానెల్ గాని పెట్ట మన్నాను. అమ్మ, మరి కాసేపు చూడు నాయన అంది. సరే అన్ని మళ్ళీ టీవీ మీదకి దృష్టి మల్లిన్చా. సీరియల్ లో ఒక భర్త, ఇద్దరు భార్యలు. భర్త కి తనకి రెండో భార్య ఉన్నట్టు తెలీదు. మొదటి భార్యకి తనకి పెళ్లైనట్టు తెలీదు. డైరెక్టర్ కి వాళ్ల చేత యాక్ట్ చేయించటం తెలీదు. ఇవనీ కూడా మూడో క్లాస్ చదవటం మానేద్దమన్న మతి మాలిన వెధవను నాకే అర్ధం అయ్యింది. ఇక నేను సహించ లేక పోయా. అమ్మ పోనీ క్రికెట్ అయినా పెట్టవే అన్నా. కాళ్ళు విరగ కొడతా వెధవాయి కదిలేతే అంది. నేను ఈ మాటు వస్తున్న దుఖాన్ని, జన్తికీలు అయి పోవటం మూలను, మరికొంత దుఖంతో మింగేసాను. ఈ లోపల మొదటి భార్య కి రెండో మొగుడు వచ్చాడు. ఈ రెండో మొగుడు రెండో భార్య కి అన్నయ్య అని చెప్ప బడింది. ఇదేమి దరిద్రం అని నేను అనుకుంటూ ఉండగా, డైరెక్టర్ కుక్క పిల్ల ఈ డిస్క్రిపన్సి కని పెట్టేసి సెట్ మీద కొచ్చేసి మొదటి మొగుడు, రెండో మొగుడు అన్నా తమ్ముల కాని రెండో భార్య రెండో మొగుడు ని అన్న లా చూసుకుంటుంది అని సర్దేసింది. ఇహ నా దుఖం కట్టలు తెంచు కొంది. అప్పుడు మా అమ్మ చేసిన మోసం నాకు అర్ధం అయ్యింది. అప్పటికి అప్పుడు నా పుస్తకాల బస్తా తీసుకొని, సిరికింజెప్పక రీతి లో ఒక్క అంగలో వీధి లో ఇంకో రెండు అంగాలలో నా స్కూల్ లో ఉన్నా. ఇంతకీ ఈ రోజే మళ్ళీ ఈ టీవీ చూశా. "నీ పిండా కూడు తిన తరమా" వస్తోంది(re runs కావన్దోయ్). నా తరమా అని టీవీ కట్టేసా అని చెప్పాల్సిన అవసరం వేరే గా లేదు. ఇంతకీ విషయం, నాకిప్పుడు నలభయ్ నిండాయి. (ఈ టీవీ పెట్టి ముప్పయ్ ఏడు వసంతాలు కాలేదు. exaggeration అని గమనించాలి)

Friday, October 17, 2008

అసందర్భ ప్రేలాపన

ఈ మధ్య ఒక పార్టీ లో అవీ ఇవీ మాట్లాడుతుంటే, మీరా నాయర్ namesake గురించి ప్రస్తావన వచ్చింది. కొంత మంది కి అది చాల నచ్చింది. నచ్చని వాళ్ళకి అస్సలు నచ్చ లేదు. కాని విషయం namesake గురించి కాదు.


ఎవడో namesake నచ్చని వాడు మీరా నాయర్ తీసిన కామ సూత్ర మూవీ కోట్ చేస్తూ అసలు ఏముంది ఆ సినిమా లో సెక్స్ తప్ప అన్నాడు.
నేను అన్నా utsav బావుంది వాత్సాయనుడు రాసిన కామ సూత్ర గురించి అని.
దానికి జంబు లింగం బుర్ర గోక్కుంటూ అడిగాడు కామ సూత్ర రాసినది వాత్సయనుడా అని ?
అది విని మేము వాడివైపు బోలెడు హాచర్యం తో చూస్తే, వాడి గర్ల్ ఫ్రెండ్ భయంగా చూసింది.
ఆ అమ్మయి స్వచ్చమైన ఈతోస్ నీరు లా కారి పోతుంటే ఇంకొక ఫ్రెండ్ , సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ ఎవరు రాసిందీ అన్నది తెలియటం కాదు ముఖ్యం అన్నాడు.
దానికి వాడి భార్య యధాలాపం గా అవును తెల్సిన వాళ్లందరూ ఏదో పోడిచేస్తారని లేదు అంది.
దాని కి మా వాడు చేతులో ఉన్నా బీర్ ని కిందకి దింప కుండా తాగే ప్రయత్నం చేసి విఫలమై దానిపై ఇంకేమి వినాల్సి వస్తుందో అని బెరుగ్గా వాడి భార్య వైపు చూశాడు.
వాడి అవస్థ చూసి, నేను తగునమ్మా అని, బుద్ధి పాస్టా తిని, అదేంటి మన వాడు కింగ్ కదా అన్నా.
ఆవిడ కన్నా మీకే ఎక్కువ తెల్సినట్టున్దే అని ఒక నొక్కు నొక్కింది మరో శూర్పణఖ.

నేను టాపిక్ మల్లిద్దామని, రామ లింగాని అడిగా నీకేదో ఇంటర్వ్యూ ఉందన్నావ్ కదా ఎప్పుడూ అని? వచ్చే వీకెండ్ ఉంది నేను , నా వైఫ్ వెళ్తున్నాం అన్నాడు.
వీకెండ్ ఇంటర్వ్యూ ఏమిటండీ అని అంతటి తో ఊరుకోక మీ ఆవిడని కూడా ఇంటర్వ్యూ గట్రా చేస్తారా ఏమిటి అన్నాను. తర్వాత నాలిక తెగింది కాని అప్పటికే EVV సినిమా లా లో లాగ రెండో అర్ధం నాకే అపశ్రుతి లా విన పడింది.
పోనీలే అతనికి అర్ధం కాదు అని ఆర్ద్రత నిండిన కళ్ళ తో అతనిది వైపు చూశా. అతనిది కూడా చిన్నాప్పటి నించీ ఉప్పు తిని, పరుచూరి డైలాగ్స్ విని పెరిగన వళ్ళు గామోసు. గుర్రు గా నా వైపు చూసి పక్కనే ఉన్న శంబు లింగం తో ఏదో intellectual సంభాషణ మొదలు పట్టాడు. అప్పుడప్పుడూ చలం, తిలక్ పేర్లు మాత్రం విన పడేటట్టు గా.

నేను ఇలా కాదని మొన్ననే కొన్న treadmill గురించి కొద్ది గా డప్పు కొడదామనిపించి ఉగ్ర లింగం తో అన్నా, అసలే ఈమధ్య కొద్దిగా లావేక్కేనేమో అనిపించి treadmill తీసుకున్ననోయ్ అని.
నాకన్నా మూడింతలున్న లింగం వాడు తింటున్న లేస్ చిప్స్ ని ఆప్యాయం గా చూస్తూ ఇంకెంతో ఏకాగ్రత తో గౌకమోలి డిప్ లో పొందిక గా ముంచు తూ బావుంది అన్నాడు.
చిప్ గురించో treadmill గురించో అర్ధం కాలేదు.
కాని వాడి భార్య ఉగ్రంగా నా వైపు చూస్తూ నీ జిమ్మడ, ట్రేడ్ మిల్ మీద పరిగెడుతూ పడి నీ కాళ్ళు పడి పోను అని మనసు లో తిట్టుకోడం విన పడింది.
తిలక్ కథలో "కొత్త గా లెంబ్రేట కొన్నాను సుబ్బారావు ఎలా ఉంది? అని అడిగినాదానికి తప్పకుండా ఆక్సిడెంట్ అయి చ్చి పోతావు" అని సుబ్బారావు తిట్టుకోడం గుర్తొచ్చింది.
ఉగ్రం మీద అక్కసు మీద అన్నవి లే అని ఆవిడని జాలి గా చూస్తుంటే, ఉగ్రం చేతి లోని చిప్స్ మమ్మల్ని కాపాడావు అన్నట్టు గా నా వైపు చూసేయి.
ఈరోజు కి ఈ వ్యర్ధ మైన సంభాషణ ఇంతటి తో ఆపక పోతే నా ప్రోగ్రాం లో వెయ్యి బగ్గులు వచ్చెను అని భేతాలుడు భయ పెట్టటం తో...