Wednesday, January 28, 2009

ఎవరు ఏ టపాలకి కామెంట్స్ రాసారో చూడటం ఎలా?

నాకు అప్పుడప్పుడూ ఎవరు ఏ,ఏ బ్లాగ్ ల లో, ఏఏ టపాలకి కామెంట్స్ రాసేరో చూద్దామని అనిపిస్తుంది. ఉదాహరణకి కొత్త పాళీ గారు ఏ బ్లాగులలో, ఏ టపాలకి వ్యాఖ్యలు రాసారో చూద్దామంటే నాకు వెసులుబాటు ఇక్కడ కనపడింది: [ఇంకో విధానం మీకు తెలిస్తే తెలుప గలరు]
కొత్త పాళీ గారి వ్యాఖ్యలు


మీరు ఎక్కడ వ్యాఖ్యలు రాసేరో తెలియాలంటే ఈ లంకె వాడుకోవచు:
<a href="'http://www.Bhalira.com//bhalira/LinqServlet?Action=" target="'bhalira'"><img src="&#39;http://www.bhalira.com/bhalira/jsp/my_comments.PNG&#39;/" /></a>

మీకు బ్లాగర్ పేరు తెలిస్తే http://www.bhalira.com/ పేజీ మీద "Advanced Search" నొక్కి, బ్లాగర్ పేరుని keywords ఫీల్డ్ లో టైపు చేసి, "అన్ని టైపులు" బదులు "బ్లాగర్" టైపు సెలెక్ట్ చేసి సెర్చ్ చెయ్యండి. బ్లాగర్ రిజల్ట్స్ నించి , మీకు కావసిన బ్లాగర్ "రాసిన వ్యాఖ్యలు" లంకె నొక్కండి.మీరు మీ వెబ్ సైట్ మీద లంకె వేద్దాము అంటె, బ్లాగర్ రిజల్ట్స్ నించి, మీకు కావాల్సిన బ్లాగర్ "వ్యాఖ్యల లంకె మీ వెబ్ సైట్ కి" నొక్కండి. మీరు బ్లాగ్ స్పాట్ మీద ఉంటే, భళిరా గాడ్జెట్ మీ బ్లాగ్ మీద పెట్టుకో వచ్చు. ఇది ఎప్పటికప్పుడూ, కొత్త గా పబ్లిష్ అయ్యిన టపాలని మీ బ్లాగ్ మీద నే చూపెడుతుంది. ఈ గద్గేట్ నించే, మీరు సెర్చ్ చేసి కామెంట్స్ , టపాలు చూడ వచ్చు.పెట్టుకొనే విధానం ఇక్కడ వివరించ బడింది. http://bhalira.blogspot.com/2008/11/blog-post.html

Tuesday, November 18, 2008

జేమ్స్ బాండు కి కాసింత ఓదార్పు

బాండ్ సినిమా అంటే (నాకు) ఒక విధ మైన expectation ఉంది. బాండ్ సినిమా ల లో ఉండేది యాక్షన్, అందమైన అమ్మాయిలు, కొద్దిగా శృంగారం, కొత్త వి వింతైన గాడ్జెట్ ల ప్రదర్శన. ఇదమిద్దంగా రొటీన్ ఫార్ములా. ఎప్పుడూ ఇక తరువాతి బాండు సినిమా చూడ కూడదూ అనుకుంటూనే చూడటం ఆనవాయితీ అయిపోయింది. చూడ కూడదు అని అనుకోవటం ఎందుకూ అంటే కథ లో పెద్ద వైవిధ్యం ఉండదు కాబట్టి. ఈ బాండు సినిమా లో కూడా వైవిధ్యం పెద్ద గా లేదు కాని బాండు వ్యక్తిత్వం ప్రదర్సన లో కొద్దిగా తేడా కనబడింది. ముఖ్య మైనది ఏమిటీ అంటే, Bond gets personnel. తను ప్రేమించిన అమ్మాయి చనిపోయిన నేపధ్యం లో, బాండు ప్రతీకారం తీర్చు కొనే ప్రయత్నం. తర్వాతది, మొదటి సారి బాండు , హీరోయిన్ తో శృంగారం చెయ్యక పోవటం. ఇంకా "shaken but not stirred" dialogue ని బార్తెన్దర్ చేత చెప్పించటం. (బాండు మూవీ ల లో బాండు చెప్పే ట్రేడ్ మార్క్ డైలాగు ). ఓవర్ ఆల్ గా బాండు ని సెంటిమెంటల్ గా ఓవర్ హాల్ చెయ్యటం. నాకైతే బాగానే నచ్చింది ఈ ట్విస్ట్. బ్రాస్నన్ బాండు సినిమా ల లోని ద్వంద అర్ధ సంభాషణలు (double entendres) క్రైగ్ సినిమా లో కన పడవు. ఇది కూడా మంచి మార్పు. క్రైగ్ కి సూట్ అవవు ఏమో కూడా. బాండు సినిమా ల లో ఉండే సట్ల్ కామెడి ఎలిమెంట్ లేదు. గాడ్జెట్ లు కూడా లేవు. అసలు Q నే లేడు. నేను ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. బాండు ని సెంటిమెంటల్ చూపెట్టటం నా వరకు బాగానే ఉంది. క్రైగ్ మాత్రం మంచి బాండ్ ల లో ఒకడు. బాండు సినిమా కి కూడా ఇంట వివరణ అవసరమంటారా? అలాగే కానివ్వండి.. ఏదో ఉబుసు పోక సినిమా చూడటం, ఆ పైన ఈ టపా..

Wednesday, November 12, 2008

కాలం చెల్లిన బర్బరీకుడు

నాకు భారతం లోబాగా నచ్చే వోళ్ళు ఇద్దరైస్. బర్బరీకుడు , దుశాసనుడు.
దుశాసనుడు ఎర్రి బాగు తనం ఏ మాత్రం లేకుండా సేయ్యాల్సిన ఎదవ పనులు సేసి సచినోడు. ఇహ బర్బరీకుడో? ఉత్త ఎర్రి బాగులతనం కారణం గా సచ్చాడు. కొద్దిగా లోతుగా సూస్తే...
బర్బరీకుడు మహా బలశాలి, పవన్ కళ్యాన్ మాదిరి మాట. రవి నే ఇదమిద్దం గా సొంతం సేసుకున్న కురు సామ్రాజ్యాన్ని (అంటే రవి అస్తమించని బ్రిటిష్ లాగ ఐయ్స్) ఒక బాణం లో మట్టాష్ చేయ గల వీరుడు.
అతని కాడ మూడు బాణాలు ఉండేవి. కిట్టుడు యాజ్ యూజుఅల్ ఆడి కాడికి మారు ఏషకం లో పొయ్యి, ఏందిరా మూడు బాణాలు ఎవడికీ అని అడిగీసీడు.
ఆడు ఎర్రి బ్లాగులాడు (అంటే నా లాగ) .
ఒకటి కురు సైన్యానికి అన్నాడు.
ఇంకోటి అని అడిగితే కిట్టుడు కైస్ అనీసాడు.
మూడేది అంటే, మూడో దేటిస్ మూడోది, నెక్కలు రావేటి అని గసిరీసాడు.
ఆ దెబ్బకి కిట్టుడికి గుండె సెరువు అయ్యిపోనాది. నెక్కలు రానందుకు గాడు. కిట్టుడిని సంపీస్తాడని.
ఇంకెందుకు ముసుగులో ఫైటింగ్ అనీసి, నేనే ఆ కిట్టుడిని, నీ తల కాయి ఇచ్చేయ్స్ గలాటకి బలి కావలి అని అడిగీసాడు.
మరి లారెన్సే అందరినీ ఉతికి ఆరేస్తే నాగ్గాడు ఎందుకైస్.
bఅర్బరీకుడు ఎర్రి బ్లాగులోడు కదా! ఆడు ఇచ్చీనాడు .
ఇంతకీ నాను సెప్పేది ఏంటీ అంటే, అలాటి ఎర్రి బ్లాగులోలు మనలోనూ ఉన్నరేహే. అలాటి ఎర్రి బ్లాగుల తనం మన నించి పోవలైస్.

Sunday, November 9, 2008

క్లెవర్ , కాన్త్రోవర్శియల్ టపాలు నేనూ రాస్తా!

ఏంటో ఈ మధ్య నే బ్లాగర్ అయిన నేను, చాల క్లేవేర్ గా చాల మంది మెదడుకి బాగా పదును పెట్టేటు వంటి రాసిన టపాలని చదివేసా. చదివేహేసాక నాకు ఏవైనా రాసేహేయ్యాలి అనిపించింది. ప్రస్తుతానికి క్లేవేర్ గా వ్యాఖ్యలు రాసే క్లేవేర్నేస్స్ గురుంచి రుష్యసృన్గుడి లా కొద్దిగా తపస్సు చేసి ఈ కింద ప్రశ్నలని, పనికి మాలిన వారికి ఉత్తుత్తునే వరాలిచ్చే (అంటే నాలాటి వారకా? హతోస్మి) బ్రహ్మ ని గాని, పోనీ జీసుస్ నైనా పర్లేదు (సేక్యులరిసం కోసం మాట) కోరుకుంటా:[నన్నుమన్నించాలి నా GK పూరు , నాకు రెండే మతాలు తెలుసు]
బ్రహ్మానందం బెస్ట్ కమెడియన్ నా , లేక బాలకృష్ణా ?
రాముడు ఆర్యన్ అయితే రావణుడు సంతతి మనమా?
చిరంజీవి కి సూపెర్ మాన్ కి యుద్దం అయితే ఎవరు గెలుస్తారు?
ఇంజనీరింగ్ నాలుగు ఏళ్ళు చదివి సాఫ్ట్ వేర్ జాబు చెయ్యటం నైతికతా ?
సల్మాన్ ఖాన్ బాగా కాలుస్తాడ , అభినవ్ బింద్రా నా ?
మీరు ఆఫీసు లో 8 గంటలూ సిన్సియర్ గా పని చేస్తారా ? చెయ్యక పోవటం నైతికతా ?
ఆకలి అహింస కట్టుబాటు దాటితే తప్పవుతుందా ?
ఓల్డ్ ఏజ్ హోమ్స్!
ఎవరైన్నా ఈ టీవీ సీరియల్స్ దర్శకులని, రచయితల కి హాని కలిగిస్తే అది సెల్ఫ్ డిఫెన్స్ కింద వస్తుందా?

మీరే నా పాలిట బ్రహ్మ అయితే మీ బ్లాగ్ మీద వరం ఇవ్వండీ. మీరు మరొక రుష్య సృన్గుడు అయితే ఒక వ్యాఖ్య రాయండి (జోగి , జోగి వ్యాఖ్యలు రాసుకుంటే జోగు వచ్చిందని, నిద్ర కూడా నాకు సమ్మతమే) .

Saturday, November 8, 2008

ఏ[౦] (దిక్కు) తోచక

తూర్పున ఎదురు చూసే నీ నయనం
పశ్చిమాన పరితపించు నీ హృదయం
ఉత్తరమే ఇరువురకూ అనుసంధానం
దక్షిణ గా కావాలి నీ దరహాసం

Saturday, October 25, 2008

నవ్వి పోదురు గాక నాకేమి..

చీకటిని కరిగిస్తూ కరుగుతూన్న కొవ్వొత్తి
మరెదో లోకం లో ఉన్నా అన్న భ్రాంతి

చల్లగా వీచేను శీతలపు గాలి
నాకేమి భయం చెంత ఉండ చెలి

మబ్బులను చీలుస్తూ మెరిసింది ఓ మెరుపు
ప్రియురాలి కళ్ళ లో కనపడే కాంక్ష ఎరుపు

ఆగి ఆగి గర్జించే ఆకాశం ఓ ఉరుము
వెచ్చగా తగిలేటి ప్రియురాలి నడుము

మెల్లగా వినపడేటి జగజ్జీత్ సింగు
అనిపించే ఈ సమయం ప్రపంచానికి నేనే కింగు

విరహ వేదన

చీకట్లో, నా మనసు వాకిట్లో నీ శిరోజాలు చిక్కుబడి
గది లో, నా ఈ మదిలో విన పడే నీ అడుగుల సవ్వడి

నిశీధి లో, ఈ నీరవం లో కరిగిన మంచు లా నీ రూపం
నా ఈ వ్యధలో, నీ ఈ దూరం, ఏ సోమయాజి శాపం

ఏకాంతం లో, నా హృదయంలో, ఎవరు విరహపు మంటలు రేపారు
నిశ్శబ్దం లో, నీ మౌనం లో ఎవరు నిరాశ నీడై వచ్చారు

నీ విరహం లో, నా గుండెలలో ఎవరు సంధిచారు శరం
మన కలయిక లో నీ కౌగిలి లో ఎప్పుడో కరిగే వరం