Friday, October 17, 2008

అసందర్భ ప్రేలాపన

ఈ మధ్య ఒక పార్టీ లో అవీ ఇవీ మాట్లాడుతుంటే, మీరా నాయర్ namesake గురించి ప్రస్తావన వచ్చింది. కొంత మంది కి అది చాల నచ్చింది. నచ్చని వాళ్ళకి అస్సలు నచ్చ లేదు. కాని విషయం namesake గురించి కాదు.


ఎవడో namesake నచ్చని వాడు మీరా నాయర్ తీసిన కామ సూత్ర మూవీ కోట్ చేస్తూ అసలు ఏముంది ఆ సినిమా లో సెక్స్ తప్ప అన్నాడు.
నేను అన్నా utsav బావుంది వాత్సాయనుడు రాసిన కామ సూత్ర గురించి అని.
దానికి జంబు లింగం బుర్ర గోక్కుంటూ అడిగాడు కామ సూత్ర రాసినది వాత్సయనుడా అని ?
అది విని మేము వాడివైపు బోలెడు హాచర్యం తో చూస్తే, వాడి గర్ల్ ఫ్రెండ్ భయంగా చూసింది.
ఆ అమ్మయి స్వచ్చమైన ఈతోస్ నీరు లా కారి పోతుంటే ఇంకొక ఫ్రెండ్ , సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ ఎవరు రాసిందీ అన్నది తెలియటం కాదు ముఖ్యం అన్నాడు.
దానికి వాడి భార్య యధాలాపం గా అవును తెల్సిన వాళ్లందరూ ఏదో పోడిచేస్తారని లేదు అంది.
దాని కి మా వాడు చేతులో ఉన్నా బీర్ ని కిందకి దింప కుండా తాగే ప్రయత్నం చేసి విఫలమై దానిపై ఇంకేమి వినాల్సి వస్తుందో అని బెరుగ్గా వాడి భార్య వైపు చూశాడు.
వాడి అవస్థ చూసి, నేను తగునమ్మా అని, బుద్ధి పాస్టా తిని, అదేంటి మన వాడు కింగ్ కదా అన్నా.
ఆవిడ కన్నా మీకే ఎక్కువ తెల్సినట్టున్దే అని ఒక నొక్కు నొక్కింది మరో శూర్పణఖ.

నేను టాపిక్ మల్లిద్దామని, రామ లింగాని అడిగా నీకేదో ఇంటర్వ్యూ ఉందన్నావ్ కదా ఎప్పుడూ అని? వచ్చే వీకెండ్ ఉంది నేను , నా వైఫ్ వెళ్తున్నాం అన్నాడు.
వీకెండ్ ఇంటర్వ్యూ ఏమిటండీ అని అంతటి తో ఊరుకోక మీ ఆవిడని కూడా ఇంటర్వ్యూ గట్రా చేస్తారా ఏమిటి అన్నాను. తర్వాత నాలిక తెగింది కాని అప్పటికే EVV సినిమా లా లో లాగ రెండో అర్ధం నాకే అపశ్రుతి లా విన పడింది.
పోనీలే అతనికి అర్ధం కాదు అని ఆర్ద్రత నిండిన కళ్ళ తో అతనిది వైపు చూశా. అతనిది కూడా చిన్నాప్పటి నించీ ఉప్పు తిని, పరుచూరి డైలాగ్స్ విని పెరిగన వళ్ళు గామోసు. గుర్రు గా నా వైపు చూసి పక్కనే ఉన్న శంబు లింగం తో ఏదో intellectual సంభాషణ మొదలు పట్టాడు. అప్పుడప్పుడూ చలం, తిలక్ పేర్లు మాత్రం విన పడేటట్టు గా.

నేను ఇలా కాదని మొన్ననే కొన్న treadmill గురించి కొద్ది గా డప్పు కొడదామనిపించి ఉగ్ర లింగం తో అన్నా, అసలే ఈమధ్య కొద్దిగా లావేక్కేనేమో అనిపించి treadmill తీసుకున్ననోయ్ అని.
నాకన్నా మూడింతలున్న లింగం వాడు తింటున్న లేస్ చిప్స్ ని ఆప్యాయం గా చూస్తూ ఇంకెంతో ఏకాగ్రత తో గౌకమోలి డిప్ లో పొందిక గా ముంచు తూ బావుంది అన్నాడు.
చిప్ గురించో treadmill గురించో అర్ధం కాలేదు.
కాని వాడి భార్య ఉగ్రంగా నా వైపు చూస్తూ నీ జిమ్మడ, ట్రేడ్ మిల్ మీద పరిగెడుతూ పడి నీ కాళ్ళు పడి పోను అని మనసు లో తిట్టుకోడం విన పడింది.
తిలక్ కథలో "కొత్త గా లెంబ్రేట కొన్నాను సుబ్బారావు ఎలా ఉంది? అని అడిగినాదానికి తప్పకుండా ఆక్సిడెంట్ అయి చ్చి పోతావు" అని సుబ్బారావు తిట్టుకోడం గుర్తొచ్చింది.
ఉగ్రం మీద అక్కసు మీద అన్నవి లే అని ఆవిడని జాలి గా చూస్తుంటే, ఉగ్రం చేతి లోని చిప్స్ మమ్మల్ని కాపాడావు అన్నట్టు గా నా వైపు చూసేయి.
ఈరోజు కి ఈ వ్యర్ధ మైన సంభాషణ ఇంతటి తో ఆపక పోతే నా ప్రోగ్రాం లో వెయ్యి బగ్గులు వచ్చెను అని భేతాలుడు భయ పెట్టటం తో...

3 comments:

Rajendra Devarapalli said...

యాజి గారు బాగుంది టపా,కానీ ఇంకాస్త మెరుగులు దిద్దాల్సింది.పంక్తుల మధ్య,పేరాల మధ్య కాస్త విరామం,అక్కడక్కడా కాసిని ఆశ్చర్యార్ధకాలు,ప్రశ్నార్ధకాలు ఇలాంటివన్నమాట,ఇదేనేను మొదటిసారి మీ బ్లాగు చూడటం.ఆల్ ది బెస్ట్.
అవునూ ఈ కింది వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి,కామెంట్ మోడరేషన్ పెట్టండి

yaji said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

హ హ హ. భలె భలె.
రాజేంద్రుని సూచనలు శిరోధార్యం.
ప్లస్ లింగాల కౌంటు మరీ టుమ్మచ్ అయి ఏ బోడి లింగం ఎవడో అర్ధం కాకుండ పోయింది.
బైదవే, Namesake గురించి నా మాట ఇదిగో.