Saturday, October 25, 2008

అనగనగనగా ఒక శర్మ

Disclaimer: ఈ కథ లో పాత్రలు అన్నీ హిండాలియం తో చేయ బడినవి. కిలం పడితే అటూ ఇటూ చూసుకొని కిల(౦), కిల(౦) అంటూ సర్దుకు పోతారని ఆశిస్తూ

అనగనగనగా ఒక సోమ భూపాల శర్మ. ఇప్పుడంటే మన సినిమా రచయితలూ, డైరెక్తర్స్ కథల కోసం లుంగీ పైకెత్తుకొని దిండు, చాప, పెన్ను, కాగితం పుచ్చుకొని ఫారిన్ ఫిల్మ్ ఉత్సవాలకో వెళ్లి పోవటం మొదలెట్టారు కాని, శర్మ హయాం లో ఇంకా పెళ్ళయిన భగవాన్ బాబు తన ప్రియురాలు తో చిలిపిగా నీకేమి తెచ్చేనో చెప్పుకో అంటూ అడిగితే గారం గా ప్రియురాలు అబ్బ నేను చెప్పా లేను బాబు, మీరే చెప్పండి అంటే "ఇదిగో నీ కోసం చుక్కల చీర" అన గానే చుక్కల చీర లూ, పిడికెలు, గాడిద గుడ్లూ బ్యాక్ డ్రాప్ గా పాట సినిమా తీసే రోజులు.
అలాగే సర్పేశ్వర రావు కి సిగ్గు పడుతూ వాళ్ల ఆవిడ నాకు మామిడి కాయ తినాలని ఉంది అంటే వెర్రిబాగుల వాడి లా ఎందుకూ? అని అడిగితే సిగ్గు పడుతూ గోడ మీద వేలాడుతూన్న ఒక బుజ్జి గాడిద పిల్ల ఫోటో చూపెడితే, సర్పేశ్వర రావు 'అమ్మ దొంగా' అని పెళ్ళాం ని వాటేసుకుని అచ్చం నీ వెధవ పేస్ వస్తూంది అంటే కాదు నీ దరిద్రం పేస్ వస్తుంది అని పాడుగునే టైమ్స్ మాట.
ఇలాంటి టైమ్స్ లో శర్మ ఇంగ్లీష్ వాళ్లు తీసిన జీసస్, రజనీష్ లాటి సినిమా లు చూసి బాగా ఉత్తేజం పొంది తెలుగు లో ఒక సినిమా తీశాడు. బాగా హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా అదే కథ ని కొద్ది గా పేరు మార్చి "పుండు", "పుండు మీద కారం చల్లితే" అని చెప్పి చాల పేర్ల తో చాల బాగా తీసాడు. ఇదే ఊపులో బావుందా , బావుందా అని ఇంకో సినిమా ని Is it good, Is it good అనే ఇంగ్లీష్ సినిమా ప్రేరణ తో తీశాడు.
మన సెన్సార్ వాళ్లు ఆ సినిమా లో బూతు మాటలని , బూతు సన్ని వేసాలని, ఇంకా ఈ టీవీ వాళ్లు ఫ్రీ గా వార్త ల లో చూపెట్టే లాటి రక్త పాత సన్నివేసాలని యధా తధం గా ఉంచేసి , సెన్సార్ మెంబెర్స్ లో ఒకడి మనవరాలు అప్పుడే మూడో తరగతి లో కోత గా అంకెలు నేర్చు కొన్న దృష్ట్యా ఒహ రెండు అంకెలు ఆ అమ్మాయి ని చెప్పా మంటే ఆ అమ్మాయి C, 7 చెప్పహా , శర్మ సినిమా లోంచి రెండు , ఏడు రీల్స్ ని తీసేసి రిలీజ్ చేసేశారు.
శర్మ కి చాల కోపం వచ్చింది. చేతి లో కర్పూరం వెలిగెంచేసుకొని ఎవరైనా వచ్చి ఆర్పుతారని కాసేపు చూసి ఎవరూ రాక తనే ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదేసుకొని ఇంక నేను హిందీ లో తప్ప తెలుగు లో సినిమా తీయను అని ఆంధ్ర దేశం వది లేసి వెళ్లి పోయాడు.
ఇది విని సముద్రానికి వాడెవడో గుర్తు కొచ్చేసి చాల సేపు పగల బడి నవ్వేసింది. నిండు సభ లో లక్ష్మణ దేవర నవ్వితే రాముడు explanation అడిగినట్టు గా, సముద్రం అలా నవ్విందని కోపం వచ్చి ఏ explanation అడగ కుండా అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ ట్రీ చైనా మీద యుద్ధం ప్రకటించాడు. ఒక అర నిమిషం పోయాక చైనా ప్రెసిడెంట్ యింగ్ యాంగ్ కి కాల్ చేసి ఫోన్ లోనే కాళ్ళ మీద పడి పోయి , తూచ్ నేను బంగ్లాస్తాన్ అన బోయి రెండు పేర్లు ఒక లాగే ఉంటే కన్ఫూస్ అయిపోయాను అని తెగ ఇది అయిపోయాడు. సర్లెండి ఆ గొడవ ఇప్పుడు ఎందుకు కాని..
సశేషం

3 comments:

yaji said...

మీరు శర్మ ఫ్యాన్ అయితే క్షమించాలి. నాకు అతని సినిమా లు చాల మటుకు ఇష్టమే.
ఉన్న చాలా చాల మంది లో అతను చాల చాల బెటర్. ఏవో ఒకటి రెండు నచ్చని అంశాలు. సో, బాటం లైన్ ఏమిటీ అంటే, ఇది మీరనుకుంటున్న మనిషి గురించే కొంచెం కాని మొత్తం కాదు.

కొత్త పాళీ said...

Hilarious stuff.

ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నారండీ మీరు??

లత వొరువూరు said...

you have a fan too :)